బునాది గాని కాలువను సాధించి రైతాంగానికి సాగునీరు అందించిన సిపిఎం ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
బునాది గాని కాలువను సాధించి రైతాంగానికి సాగునీరు అందించిన సిపిఎం పార్టీ అభ్యర్థి యండి జహంగీర్ గారి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నందనము, నమాత్ పల్లి, తుక్కాపురం బొల్లెపల్లి, నాగిరెడ్డిపల్లి తో పాటు పలు గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి. జాహంగీర్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ఎర్రజెండా సిపిఐ ఎం పార్టీ నాటి నుండి నేటి వరకు భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి పేదలకు అండగా ఉన్నదని అన్నారు. దున్నేవాడికి భూమి కావాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు కావాలని రైతుకు గిట్టుబాటు ధర కావాలని, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెరగాలని సమరశీలంగా ఉద్యమించి ప్రజలకు అండగా నిలిచిందని అలాంటి ఎర్రజెండా పార్టీకి పార్టీ అభ్యర్థికి ప్రజలు ఎన్నుకుంటే ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని తెలియజేశారు. అవకాశవాద రాజకీయాలతో డబ్బుల సంచులతో కులము మతము ప్రాంతము పేర్లతో ప్రజల్ని విభజించు పాలించు అనే విధంగా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ అభ్యర్థులు ముందుకు వస్తున్నారని వారికి ఏనాడు ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర లేదని అలాంటి వారికి ఓట్లు వేస్తే ఈ నియోజకవర్గ మరింత వెనుక పాటు గురవుతుందని అన్నారు. ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాగు, సాగునీరు కోసం, విద్య, వైద్యం కోసం నిరంతరం పోరాడే ఎర్రజెండా అభ్యర్థి జహంగీర్ గారి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, కారేపల్లి సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర, గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామారావు, సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎన్.పి.ఆర్. డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, దానయ్య, శివ, తదితరులు పాల్గొన్నారు.
Apr 26 2024, 13:10