NLG: జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం
నల్లగొండ: బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో OBC మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఓ బి సి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం బుధవారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన నాలుగు అసెంబ్లీ లు (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మరియు నల్లగొండ,) ల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా OBC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. దేశానికి భారత ప్రధాని చేస్తున్నటువంటి నిరంతర కృషిని కొనియాడారు. ముఖ్యంగా బీసీ బిడ్డయినా ప్రధాని మోదీ సామాజిక న్యాయం కోసం అతని మంత్రివర్గంలో అత్యధికంగా 27 మందికి స్థానం కల్పించి, తన సామాజిక న్యాయం చాటారు మరియు బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచటానికి ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన క్రింద 18 రకాల చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచీకత్తు లేని రుణ సదుపాయాలను కల్పిస్తూ, తను బీసీల పట్ల గల ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం.. తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎం గా ప్రకటించి బీసీల ప్రక్షాళన కోసం చూపిన ఆదరణ నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మరొకసారి మోదీ ప్రధాని కావడం వందకు రెండు వందల శాతం రుజువు అయిందని బిజెపికి వచ్చే 400 + లో నల్లగొండ పార్లమెంటు ఉంటే మన నల్లగొండ అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐకమత్యంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గంధ మల్ల ఆనంద్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు,
నాగం వర్షిత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు,
చాడ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ ప్రబారి,
అన్నం ఈశ్వరప్ప ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
జక్కలి రాజు యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి,
మదన్ మోహన్ OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదగిరి చారి ఓబీసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నేతల వెంకటేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భవాని ప్రసాద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏరుకొండ హరి నల్లగొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి,
తిరందాస్ కనకయ్య ఓబిసి మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్ఛ జిల్లా అధికార ప్రతినిది, సామగాని దినేష్ గౌడ్, మరియు మహేష్, నరేందర్ గౌడ్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు
Apr 25 2024, 21:33