పేద ప్రజల పక్షాన పోరాడే జాహంగీర్ నే గెలిపించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఉపాధి హామీ చట్టం వచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడెం మండలం నిమ్మలగుట్ట దగ్గర ఉపాధి హామీ కూలీలను కలిసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్లను అడగడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన జాంగిర్ను గెలిపించండి అని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టలు కొడుతూ నిధులకు కోత పెట్టిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసేయాలని ఆలోచన వెనక్కి తీసుకొని పని దినాలు కూడా 200 రోజులు పెంచి, గిట్టుబాటు కూలిరేట్లను కట్టించి ఎండ తీవ్రతలకు తట్టుకునే టెంట్లను, మంచినీళ్లు తదితర మౌలిక వసతులు కల్పించి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలన్నారు. మీ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపిస్తే ఇలాంటి అనేక చట్టాలను తీసుకురావడానికి దోహదపడుతూ, పేద ప్రజల పక్షాన నిలబడే జాంగిర్ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి, మర్రిగూడెం మండలాల కార్యదర్శి లు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, నల్గొండ పార్లమెంట్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటీ శంకర్, రాములు, యాదమ్మ, మారమ్మ, ప్రమీల, సుధాకర్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
Apr 25 2024, 21:25