భువనగిరి పార్లమెంట్ మైనార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో సమావేశం
భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్లో భువనగిరి పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ రాశేద్ హుస్సేన్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల మైనార్టీ ఇన్చార్జిలు మరియు ముఖ్య మైనారిటీ నేతలతో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు మైనార్టీ ఇన్చార్జ్ జమల్ షరీఫ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ జమాల్ షరీఫ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి ఖిలా మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. దేశంలో కొనసాగుతున్న మోడీ నియంతృత్వ పాలనను ప్రాలదొలి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వము మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా ఉంటున్న అమాయక ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను దోసి అదానీ అంబానీలకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో గెలిపియాలని కోరారు.కోరారు. 2009 లో భువనగిరి పార్లమెంటు నూతనంగా ఏర్పడిన తర్వాత మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఇన్చార్జ్ మహమ్మద్ రఫీ, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జ్ సయ్యద్ రాషేద్ హుస్సేన్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ రఫీయొద్దీన్ గౌరీ, మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్, మాజీ కోఆప్షన్ ఆబిద్ అలీ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవెస్ చిష్టి,మైనార్టీ నాయకులు యూనుస్, మొహమ్మద్ అతహర్,షేక్ షబ్బీర్, అబ్దుల్ మన్నన్, అబ్బు చావుష్. తదితరులు పాల్గొన్నారు.
Apr 25 2024, 20:46