భువనగిరి మండలంలో పలు గ్రామాల్లో ఐకెపి సెంటర్ లను సందర్శించిన మండల కిసాన్ మోర్చానాయకులు
వల్దాస్ రాజ్ కాళభైరవ
కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ
భువనగిరి మండల్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మనిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ భస్వాపురం,వడపర్తి,హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లని సందర్శించడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యలన్నారు. పంటవేసినంక చేతికొచ్చెదాక ఓక ఎత్తు అయితే చేతికివచ్చినంక ఐకేపీ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు చెయ్యడం ఓక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపి సెంటర్ లో ధాన్యం తడిచి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చెయ్యలని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారుతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఏక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు
రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 15000,రైతు కూలీలకు 12000,కౌలు రైతులకు 15000 ఇస్తామని వంద రోజు ల్లో ఇస్తామనీ చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మటాలతో ప్రజలలోకీ వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్ లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖు నా భువనగిరి MP బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ భువనగిరి లో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి గారు, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు బబ్బురి సురేష్, మండల్ కిసాన్ మోర్చ సెక్రటరీ ఏడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చ మండల నాయకులు పిన్నం నారాయణ,మండల నాయకులు పిన్నం గనేష్,కడారి వెంకటేష్,అన్నెపు బాను తదితరులు పాల్గొన్నారు.
Apr 24 2024, 13:52