విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి భూక్యా సంతోష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా వాళ్ళ పిల్లలైతే కార్పొరేట్ స్థాయి స్కూల్లో హాస్టల్లో చదివిస్తారు బడుగు బలహీన వర్గాల పేదింటి బిడ్డలు బతుకు మీద భవిష్యత్తు మీద ఆశతో విద్యను అభ్యసించడానికి వచ్చిన పేదింటి బిడ్డలకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు మరియు ఫుడ్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యా సంస్థలు పూర్తిగా నిరు గారి పోతుంది, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది, మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని , జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, gvs ప్రవీణ్ నాయక్,LHPS రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Apr 22 2024, 00:51