అక్రమంగా తరలిస్తున్న హాస్టల్ కిరాణా వస్తువులను పట్టుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగి ఓ విద్యార్థి మరణించిన సంఘటన పై పూర్తి విచారణ జరగక ముందే సిబ్బంది హాస్టల్ నుండి మిగిలి ఉన్న కిరాణా వస్తువులను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు ఆటోను అడ్డగించి నిలిపివేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. హాస్టల్ లో కలుషిత ఆహారం తీసుకొని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సి.ఎచ్ ప్రశాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ పుడ్ పాయిజన్ కు కారణమైన కిరాణా వస్తువులను ఆటో నెంబర్ TS 27/ T 2170 ఆటో లో శనివారం మధ్యాహ్నం అక్రమంగా తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రమేష్ లు ఆటోను అడ్డగించి, ఆటోలోని కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ మాట్లడుతూ గురుకుల పాఠశాలల కో- ఆర్డినేటర్ రజని మేడం, రెవెన్యూ డివిజన్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జైపాల్ రెడ్డి లు హాస్టల్ తనిఖీ చేస్తున్న సమయంలోనే హాస్టల్ సిబ్బంది అక్రమంగా కిరాణా వస్తువులను ఆటోలో తరలించే ప్రయత్నం చేసారని ఆయన ఆరోపించారు. ఆటోను ఆపి డ్రైవర్ ను అడుగుతున్న సమయంలో హాస్టల్ సిబ్బంది ధనుంజయ్ వచ్చి ఆర్డీవో అనుమతి తో పంపిస్తున్నామని చెప్పగా ఆర్డీవో కు ఫోన్ చేయగా నాకు సంబంధం లేదని చెప్పాడని వెంకటేష్ తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని పంచనామా చేయాలని పట్టణ ఎస్సై అరుణ్ కుమార్ కు పోన్ లో పిర్యాదు చేయగా, మాకు సంబంధం లేదని, కిరాణా వస్తువుల శాంపిల్స్ పుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా గతంలోనే సేకరించినట్లు ఎస్సై అన్నట్లు వెంకటేష్ తెలిపారు. గురుకుల పాఠశాల రీజనల్ కో- ఆర్డినేటర్ రజని మేడంకు పోన్ చేయగా ఆమె స్పందించక స్పందించక పోవడంతో అట్టి కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించామని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే కిరాణా వస్తువులలో నాణ్యత లోపించినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. కిరాణా వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టల్ లో జరిగిన సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ ముగిసేవరకు ఎలాంటి కిరాణా వస్తువులను హాస్టల్ నుండి తరలించరాదని ఆయన డిమాండ్ చేశారు. ఆహార భద్రతా అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.
Apr 21 2024, 14:25