సిపిఎం ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన గెలవాలని కోరుతూ విరాళం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది .
ఈ సందర్భంగా ఓటు అభ్యర్థించడానికి ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన సిపిఎం ఎంపీ అభ్యర్థికి సిపిఎం సీనియర్ నాయకుడుగా ఉన్న వరికుప్పల యాదయ్య మీరు గెలవాలని కోరుతూ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని విరాళంగా ఇచ్చారు ఇంటింటికి తిరిగిన సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ కు ప్రజలు హారతులు ఇచ్చి పూలదండలు తో స్వాగతం తెలియజేశారు ప్రజల కోసం పోరాడే మీలాంటివారు ఈ ఎన్నికల్లో గెలవడం ప్రజలకు ఎంతో అవసరమని
ఈసారి మా ఓటు మీకే అంటూ అనేకమంది వారికి హామీని ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ పులిగిల్ల గ్రామంతో గత 35 సంవత్సరాలుగా అనుబంధం ఉందని మొట్టమొదటి ప్రచారం సాయుధ పోరాట చరిత్ర కలిగిన పులిగిల్ల నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్న కాంగ్రెస్,బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల యొక్క చరిత్ర ఏమిటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని,ప్రజల కోసం ఎలాంటి వ్యాపారాలు,వ్యాపకాలు లేకుండా పోరాడుతున్న నాలాంటి వ్యక్తికి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు ఈ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కొమ్మిడి లక్ష్మారెడ్డి నాయకత్వం లో గత 35 సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక పోరాటాలు నడిపి గ్రామ అభివృద్ధిని చేసి చూపించారన్నారు అమరజీవి వేముల మహేందర్ ప్రజల కోసం జీవితాంతం పోరాడి అమరుడైన ఈ గ్రామం కమ్యూనిస్టులకు ఎప్పుడు అండగా నిలిచిందన్నారు కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజల కోసం పనిచేసే సేవకున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగతా మూడు పార్టీల అభ్యర్థులు ఏనాడు ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేదని వాళ్లకున్న వ్యాపారాలను మరింత పెంచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదని అందుకే నిజాయితీగా 35 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు ఈ ప్రాంతానికి సాగునీరు అందించే బునాది గాని కాలువ ప్రారంభించి 20 సంవత్సరాలు గడుస్తున్న గత ఎంపిలుగా గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్, కాంగ్రెస్,పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా నేటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు సిపిఎం కు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే బునాది గాని కాలువను పూర్తి చేయడమే కాకుండా ఆ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంత రైతాంగానికి అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ నారి ఐలయ్య జగదీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆవనగంటి వెంకటేశం, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్,సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,స్థానిక పార్టీ నాయకులు దొడ్డి బిక్షపతి,వరికుప్పల యాదయ్య, వడ్డేమాన్ వెంకటయ్య, బుగ్గ ఐలయ్య, వేముల చంద్రయ్య,వరికుప్పల శంకరయ్య,వేముల ఆనంద్, దొడ్డి యాదగిరి, వేముల అమరేందర్, బొడ్డు రాములు,వేముల ముత్తయ్య,వడ్డెమని మధు,వనం యాదయ్య,మారబోయిన ముత్యాలు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,వరికుప్పల సతీష్,కొమ్మిడి క్రిష్ణా రెడ్డి, వరికుప్పల శ్రీశైలం,వేముల రాంబాబు,సందేల శ్రీకాంత్, వేముల జ్యోతిబస్,దయ్యాల నర్సింహ,వరికుప్పల యాదమ్మ,వేముల రమణమ్మ,మౌనిక,వడ్డెమని ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Apr 20 2024, 16:44