కేంద్రంలో మరోమారు బిజెపి సర్కార్
![]()
*భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఇంటింటి ప్రచారంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.యన్.రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలె చంద్రశేఖర్ ,పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి గౌడ్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ కచ్చితంగా గెలవడం వల్ల భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు, బిజెపి గెలవడం వల్ల కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తుందని అన్నారు, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా వారు అన్నారు ,తెలంగాణ లో టిఆర్ఎస్ పని ఐపోయింది, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని అన్నారు ఈ రెండు పార్టీలు అమలుకాని హామీలతో , తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి ఉచిత పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇవ్వాల్సిన విద్య వైద్యం మౌలిక సదుపాయాలను ప్రజల నుండి దూరం చేస్తున్నారని అన్నారు .టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయడం వృధా అని అన్నారు ,ప్రజలు బీజేపీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, సీనియర్ నాయకులు సత్తయ్య కణతాల అశోక్ రెడ్డి జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి , మండల కమిటీ సభ్యులు సంతోష్ దయ్యాల వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్,మైసొల్ల మచ్చ గిరి, మందుల నాగరాజు, మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం వెలిమినేటి వెంకటేశం బీజేవైఎం నాయకులు బుంగమట్ల మహేష్ ,రేగురి అమరేందర్, దంతూరి అరుణ్,ఏళ్ళంకి మురళి, ఎర్రబోలు జంగయ్య, పాతకోట నరేష్,మైసొల్ల హరీష్,పుండరీకం కట్ట బిక్షం శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మానవత్వం చాటుకున్నారు .భువనగిరి లో పెళ్లి వేడుకలకు హాజరై వెళుతుండగా భువనగిరి సమీపాన వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడ ఆగి క్షతగాత్రులను తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .




అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 
Apr 20 2024, 15:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.2k