పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి: ధనుంజయ గౌడ్

చండూరు: పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. గురువారం నేర్మట గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి కేంద్ర బిందువైన భువనగిరి నియోజకవర్గం నుండి పార్లమెంటులో ఎర్రజెండా ప్రాతినిథ్యం ఉండేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, బల్లెం స్వామి, బురుకల అంజయ్య గౌడ్, లక్ష్మమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
SB NEWS TELANGANA
SB NEWS NLG


 
						



 

 

 


 
 
Apr 18 2024, 22:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.3k