గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలి ఏఐఎస్ఎఫ్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది
ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టల్లో గురుకులాలు సందర్శించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈనెల 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి చిత్రపటానికి సంఘ నాయకులు విద్యార్థులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు
విద్యార్థి మృతికి కారణమైన సాంఘిక సంక్షేమ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ రజిని గారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేశారు ఇక మీదట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు
సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు మచ్చ వినయ్, రామ్ పాక చందు, శివ, సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Apr 18 2024, 17:19