ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు
ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు
ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.
Apr 17 2024, 20:22