గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి; కొడారి వెంకటేష్ ,పల్లగొర్ల మోది రాందేవ్
భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి చినలచ్చి ప్రశాంత్ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సగ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సీ ఎచ్ ప్రశాంత్(12) చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంచనపల్లి నర్సింగ్ రావు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్, బి ఆర్ ఎస్ పట్టణ సహాయ కార్యదర్శి గుండెబోయిన సురేష్ ,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండేబోయిన శంకర్, నాయకులు పోలేపాక సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Apr 17 2024, 20:16