గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి:ఏఐఎస్ఎఫ్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన లో ఆర్ సి ఓ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అడ్డ గూడూరు మండల కేంద్రము లో నిరసన*
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో బీబీనగర్ మండలం జిబ్లాక్ పెళ్లి గ్రామానికి చెందిన చిన్నచి ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన బాధాకరం
మృతుని కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు
ఈరోజు అడ్డ గూడూరు మండల కేంద్రము లో ప్రభుత్వ నికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లల్లో, ఫుడ్ పాయిజన్,జరుగుతున్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం పోయింది అని రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రజిని గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొందని ఆర్సిఓ పర్యవేక్షణ లోపంతో గురుకుల పాఠశాలల్లో నిరంతర ప్రక్రియగా ఫుడ్ పాయిజన్ జరుగుతుందని ఘటన కారణమైన ఆర్ సి ఓ నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు చెరుకు శివరాజ్ ,జిల్లా రాకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ మహారాజ్, చిప్పలపల్లి ధనుష్, సూరారం సోహిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Apr 17 2024, 20:02