CSL ఫుట్బాల్ లీగ్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా డిఎస్పి శివరాం రెడ్డి
నల్లగొండ టౌన్: CSL ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమ స్కోర్టు తో నిలిచి మ్యాచ్ డ్రా అయ్యి ముగియడం జరిగింది.
ఈ సందర్భంగా మహమ్మద్ జాన్ స్మారకార్థం వారి కుమారుడు మహమ్మద్ ఫయాజ్ అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను క్రీడాకారులకు పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీబొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి రావడం, క్రీడాకారుల తో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు.
ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్గొండ DSP శివరాం రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు, క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలిపారు. నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ను ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, శంకర్, తాజుద్దీన్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Apr 14 2024, 19:32