పోచంపల్లి పట్టణ కేంద్రంలో PDSU ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 52వ వర్ధంతి
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సాధారణ విద్యార్థిగా వచ్చి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలకు ఎదురునిలిచి విద్యార్థులందరికీ అండగా నిలిచిన జార్జిరెడ్డి నేటి విద్యార్థిలోకానికి ఆదర్శం అని ప్రగతిశీల యువజన సంఘం పి.వై.ఎల్.పోచంపల్లి పట్టణ కార్యదర్శి పడాల శివ అన్నారు.
జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో పి.డి.ఎస్.యూ.ఆధ్వర్యంలో జార్జిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో ప్రగతిశీల ఆలోచనలతో, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తి, వారితో మమేకమై ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా విద్యా రంగ సమస్యలపై, విద్యార్థి హక్కులకై, విద్యార్థులపై చేస్తున్న మూకదాడులపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని, జార్జిరెడ్డి ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాడో వారే నేడు పాలకులుగా మారి 10 ఏళ్లుగా దేశంలో అరాచక పాలన చేస్తూ, దేశాన్ని విధ్వంసం చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నారని, మరో దఫా అధికారంలోకి రావడానికి కులాల పేరిట, మతాల పేరిట చిచ్చులు పెడుతూ, దేశభక్తి పేరుతో యువతను పెడదోవ పట్టించే విధంగా పాకిస్తాన్, చైనా బూచి చూపి ఉద్వేగాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే కుయుక్తులు పన్నుతున్నారనీ,అసలు దేశ స్వతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఆర్ఎస్సెస్,బీజేపీ నేడు సినిమా రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అబద్ధపు కథలతో సినిమాలు తీసి, అదే నిజమైన చరిత్రగా, బ్రిటీష్ వారి బూట్లు తుడిచిన వారిని దేశభక్తులుగా చూపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని,
దేశంలోని విద్యారంగాన్ని విధ్వంసం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకొచ్చారనీ, దేశంలో మోడీ షా సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు. పోచంపల్లి పట్టణ నాయకులు మోజేశ్, కళ్యాణ్, చందు, రాము, సురేష్, జైపాల్, అరవింద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Apr 13 2024, 18:36