ఈనెల 19న నామినేషన్ కి వేలాదిగా తరలిరావాలి: ఎండి జహంగీర్ సిపిఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి
ఈనెల 19న జరుగు నామినేషన్ కు వేలాదిగా తరలిరావాలని సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేశాయని గత అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మరిచిపోయి కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డారని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు మరిచి పరిపాలన సాగించాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సూచికగా కావాలని నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ పరిష్కారం గాని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రజా ఉద్యమాలు జరిగిన అధికార ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అరకోర వసతులతో సరైన వైద్యం అందించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు సమస్యల పరిష్కారం కోసం సిపిఎంకు ఓటేసి గెలిపించాలని, 19న జరిగే నామినేషన్ కు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, శాఖ కార్యదర్శి దండు గిరి, సీనియర్ నాయకులు దండు యాదగిరి, నాయకులు దండు పద్మారావు, ఆడెపు గిరి, మాయ రాణి, దండు స్వరూప, దండు ధనలక్ష్మి, నాగరాణి, స్వాతి, బట్టు లక్ష్మి, బట్టుపల్లి నవీన్ కుమార్, ఎనబోయిన లింగం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Apr 13 2024, 16:29