సమాచార హక్కు చట్టం - 2005 సదస్సును విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్ సమన్వయ కమిటీ సభ్యులు
సమాచార హక్కు చట్టంపై భువనగిరి లోని రిటైర్ ఎంప్లాయిస్ భవన్ లో శనివారం ఉదయం 11గంటలకు జరిగే అవగాహన సదస్సును విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన భువనగిరి లో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టం ప్రాధాన్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాలనలో పారదర్శకత , జవాబుదారీ తనం ఆర్టీఐ తోనే సాధ్యమన్నారు. అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం ను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అవగాహన సదస్సులో సభాద్యక్షులుగా సమాచార హక్కు వికాసం సమితి రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఖుర్షీద్ పాషా, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం. ఏ.కరీం (హైకోర్టు అడ్వకేట్) , విశిష్ట అతిథులుగా ఆజాద్ హింద్ ఫౌజ్ జాతీయ అధ్యక్షులు ఎం. ఎ. ముజీబ్, ఆత్మీయ అతిథులుగా భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బబ్బూరి హరనాథ్ గౌడ్, సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.యర్రమాద కృష్ణారెడ్డి, మాజీ ప్రజాప్రతి నిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకవరం మోహనరావు, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, హమీద్ పాషా, పోతుగంటి సంపత్ కుమార్ , చింతకింది వెంకటేశ్వర్లు, బాబు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆర్టీఐ ఆక్టివిటీ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
Apr 13 2024, 15:10