/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ప్రజల కొరకు నిలబడుతూ హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ Vijay.S
ప్రజల కొరకు నిలబడుతూ హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ


   నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి యండి.జహింగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నిర్వహించిన అనంతరం జహంగీర్ ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ మహోత్సవ తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న సిపిఐ(ఎం) దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నదని అన్నారు. పేదలు కష్టజీవుల తరపున నీతితో నిజాయితీతో పోరాడుతూ ప్రభుత్వ రంగాన్ని పాడు కాపాడుకోవడానికి సిపిఎం నిరంతరం ఉద్యమిస్తుందని నర్సింహ తెలియజేశారు. బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నాయని విమర్శించారు. మరోవైపు అంబానీ అదానీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూనే మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి ప్రజల మధ్యన చిచ్చు పెడుతుందని ఓట్లు రాబట్టుకునే పన్నాగం బీజేపీ పన్నుతుందని విమర్శించారు. డీజిల్ పెట్రోల్ విచ్చలవిడిగా పెంచుతూ మోయరాని భారాలతో పేదల నడుముడుతూ మతాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు గుంజుకుంటుందని అన్నారు. ప్రజా వ్యతిరేక బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జాహంగీర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈనెల 19న భువనగిరి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండా అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, సభ్యులు కాసారం మల్లయ్య, కొండా హైమావతి, కూకుట్ల చొక్కాకుమారి పాల్గొన్నారు.

           

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా మల్లం వెంకటేశం నియామకం


తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా మల్లం వెంకటేశంను నియమిస్తూ. ఉద్యమకారుల ఫోరం.రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్. చీమ శ్రీనివాస్ ఆదేశం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.నియామక పత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బలోపేతనికి కృషి చేస్తూ హక్కుల కోసం పోరాడుతామని అన్నారు . తమ నియామకానికి సహకరించిన ఉద్యమ నేతలకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరంజిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్, నియోజకవర్గ అధ్యక్షుడు జోగు అంజయ్య, వలిగొండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్, . పబ్బు స్వామి, బొడిగె సుదర్శన్, శ్రీనివాసచారి, మంటి రమేష్ ,కదిరేని స్వామి. తదితరులు పాల్గొన్నారు.

రాయగిరిలో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగ


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో గ్రామ దేవతల జాతర కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం మహిళలు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు గ్రామ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నల్ల పోచమ్మ తల్లి పండుగలో త్రిబుల్ ఆర్ ఉద్యమ నాయకులు అవుశెట్టి రమేష్, ముద్దం శ్రీశైలం ,యువకులు బొజ్జా భాను, బొజ్జ శివ ,ముద్ద ఉపేందర్, సారా జీవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా దంతూరి అరుణ్ కుమార్ నియామకం


భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : పాలడుగు భాస్కర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

Lll

      భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతు పోరాడే నాయకుడు సిపిఎం అభ్యర్థి యండి.జహంగీర్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎండి. జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ శక్తులకు కారు చౌకగా అమ్మతు దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులము మతము మతోన్మాదము మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బిజెపి పాలనలో సామాన్య మానవులు నిత్యవసర సరుకులను కొని తినే పరిస్థితుల్లో లేరని అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెంచడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు దళితుల పైన మహిళల పైన గిరిజనుల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను మొత్తం దెబ్బతీస్తున్న పరిస్థితి ఉన్నదని మరో మారు ఈ దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజల బతుకుకు రాజ్యాంగానికి రక్షణ లేదని ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమయిందని బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఓడించి సిపిఎం గెలిపించాలని ప్రజలను భాస్కరు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పగిళ్ల ఆశయ్య , కొండమడుగు నర్సింహ్మ, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , సిపిఎం మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, సభ్యులు బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, గంగనబోయిన బాల్ నర్సింహ్మ , గంగదార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

           

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

రంజాన్ పండుగ ను పురస్కరించుకుని ఆలేరు పట్టణంలోని ఈద్గ వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.బీర్ల ఐలయ్య గారితో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలాయి బలాయి తీసుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్నారు.ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రజలందరి కష్టాల తొలగించి శాంతి సంపద ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు.రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమత మమత ను పెంచుతాయన్నారు..రంజాన్ పండుగ మనుషుల్లో మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందన్నారు.సమాజంలో సమానత్వం, సోదరభావాన్ని తెలియజేస్తుందన్నారు. రంజాన్ పండుగ ముఖ్యంగా దాన గుణాన్ని నేర్పుతుందన్నారు.మరోసారి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు


వలిగొండ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణాఫర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్,బి.ఎస్.పి మండల పార్టీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ* జ్యోతీ రావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది.

 పూలే మాలి కులానికి కూరగాయలు పండించి వ్యాపారం చేసే కులం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. స్వేచ్ఛా సమానత్వం వంటి పాశ్చ్యాత్య ఆదర్శాలతో ప్రత్యేకించి అమెరికాకు చెందిన టామ్ పెన్ రచనల చేత ఉత్తేజితుడై పూలే సాంఘిక సంస్కరణలు చేపట్టాడు.

 పీష్వా పీడకల పాలనను అంతం చేసిన బ్రిటిష్ పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధిని పాశ్చ్యాత్య ఆలోచనను అన్ని కులాలకు అందించారు.పీడిత ప్రజలలో, బాంబే కార్మిక వర్గంలోనూ, రైతాంగంలోనూ, పూనాలో ఆ చుట్టుపక్కల ఉన్న అంటరానివారిలోనూ పూలే తన కృషిని కేంద్రీకరించాడు.

ఆర్య దురాక్రమణదారులు స్థానిక జాతిపరమైన కుల వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించి, సత్యశోధక్ సమాజ్ రైతాంగంతో సంబంధాలు ఏర్పరుచుకుంది.

సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ పురోహితులు చేసే పెళ్లి తంతును తిరస్కరించారు. స్త్రీల కోసం పాఠశాలలను,అనాథలైన స్త్రీలకు ఆశ్రమాన్ని కల్పించారు.అంటరాని వారి కోసం పాఠశాలలను ప్రారంభించింది. మంచి నీటి బావులను వారికి అందుబాటులోకి తెచ్చారు. కుల వ్యవస్థను , అంటరానితనం సమూలంగా నిర్మూలించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్,వేముల నరేందర్,కొత్త వెంకటేష్, సారయ్య,ఎడవల్లి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్ గురువారం జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారధ్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, ఈతాప రాములు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో మైనార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల రోజులు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర దీక్షలు చేసి ,ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో ఉండాలని అల్లాహాను ప్రార్ధించిన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, ముస్లిం పెద్ద పెద్దలు, యువకులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.