వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
వలిగొండ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణాఫర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్,బి.ఎస్.పి మండల పార్టీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ* జ్యోతీ రావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది.
పూలే మాలి కులానికి కూరగాయలు పండించి వ్యాపారం చేసే కులం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. స్వేచ్ఛా సమానత్వం వంటి పాశ్చ్యాత్య ఆదర్శాలతో ప్రత్యేకించి అమెరికాకు చెందిన టామ్ పెన్ రచనల చేత ఉత్తేజితుడై పూలే సాంఘిక సంస్కరణలు చేపట్టాడు.
పీష్వా పీడకల పాలనను అంతం చేసిన బ్రిటిష్ పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధిని పాశ్చ్యాత్య ఆలోచనను అన్ని కులాలకు అందించారు.పీడిత ప్రజలలో, బాంబే కార్మిక వర్గంలోనూ, రైతాంగంలోనూ, పూనాలో ఆ చుట్టుపక్కల ఉన్న అంటరానివారిలోనూ పూలే తన కృషిని కేంద్రీకరించాడు.
ఆర్య దురాక్రమణదారులు స్థానిక జాతిపరమైన కుల వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించి, సత్యశోధక్ సమాజ్ రైతాంగంతో సంబంధాలు ఏర్పరుచుకుంది.
సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ పురోహితులు చేసే పెళ్లి తంతును తిరస్కరించారు. స్త్రీల కోసం పాఠశాలలను,అనాథలైన స్త్రీలకు ఆశ్రమాన్ని కల్పించారు.అంటరాని వారి కోసం పాఠశాలలను ప్రారంభించింది. మంచి నీటి బావులను వారికి అందుబాటులోకి తెచ్చారు. కుల వ్యవస్థను , అంటరానితనం సమూలంగా నిర్మూలించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్,వేముల నరేందర్,కొత్త వెంకటేష్, సారయ్య,ఎడవల్లి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
Apr 11 2024, 14:58