సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి! అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి!
అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ఆర్.టీ.ఐ పిసి వ్యవస్థాపక అధ్యక్షులు
జిల్లాలోని అంబేద్కర్ భవన్లో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అవగాహనలు సమాచార హక్కును విలువైన పౌర హక్కుగా గుర్తించిన నేపథ్యంలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని 12 /10 /2005 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నదని తెలిపారు.
ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పౌర సమాచార అధికారి ఈ చట్టం పేర్కొన్న విధులను నిర్వహిస్తూ ఉంటారని ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రకారం రికార్డులు దస్తావేజులు మెమోలు ఈ-మెయిల్ అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్కులర్లు, ఉత్తర్వులు, రిజిస్టర్లు, కాంట్రాక్టులు, నివేదిక నమూనాలు, క్రోడీకరించబడిన సమాచార గ్రంథం లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయబడి ప్రతి అంశం సమాచార అధికారి సెక్షన్- 8 లో ఇచ్చిన నిబంధనలకు లోబడి సమాచారం కాపీలను అర్జీదారునికి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థను జవాబు దారితనంతో అవినీతి రహితంగా పని చేయాలంటే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా పోషించాలని కోరారు.
అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందని ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచి సహ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సభ్యులను కోరారు. కొన్ని ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల సహ చట్టం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, నమీండ్ల హరీష్, వీరేందర్ రెడ్డి, డాక్టర్ కీర్తి రెడ్డి, వెంకటేష్ యాదవ్, మల్లె పాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.
Apr 11 2024, 07:11