ఆడపిల్లలకు రక్షణ కరువు ...కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి :ఏఐఎస్ఎఫ్
నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపం అయిపోయిందని అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు, కామాంధుల ఆగడాలు పెరుగుతున్నాయని మోత్కూర్ మండల కేంద్రంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అన్నారు
దానికి నిదర్శనమే గుండాల మండల కేంద్రంలో జరిగిన సంఘటన
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధితో గత కొంతకాలంగా చాక్లెట్లు ఆశ చూపి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని కలిసి వేసిందని అన్నారు కామాంధుడైన అండెం మాధవరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డీఈఓ,ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఎ ఐ ఎస్ ఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
నిత్యం విద్య సంస్థల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
Apr 10 2024, 18:41