ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో బి ఆర్ ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ లో గంగ జమున తహేజీబ్ కొనసాగుతుందని తెలంగాణ హిందూ ముస్లిం భాయ్ భాయ్ లాగా ఉంటారని ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ముస్లిం మైనారిటీ లకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం
ఆనవయితీగా వస్తుందని అన్నారు.అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ లకు ఓటు బ్యాంకు గా పరిగననిస్తుందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం లో మైనారిటీ లను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందని అన్నారు.ముస్లిం మైనారిటీ లకు రంజాన్ తోఫా మరియు ఇతర సౌకర్యాలు కల్పించలేని అసమర్ధత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని అన్నారు.మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ముస్లిం మైనారిటీ లకు అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. అలాగే ప్రతి ముస్లిం కుటుంబం సుఖ సంతోషాలతో ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి జెడ్పిటిసి సుబ్బూరు భీరు మలయ్య,
కోఆప్షన్ సభ్యులు అఫ్జల్ నిక్కత్ ఇక్బాల్ చౌదరీ.ఎండీ ముజీబ్ ఇస్మాయిల్,ఎండీ ముజీబ్,ఎండీ రహీం ఎండీ అంజద్ గఫ్ఫార్.పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వీరేష్ లు పాల్గొన్నారు.
Apr 07 2024, 21:01