మా హక్కులను కాల రాస్తే సహించేది లేదు.... లక్ష్మీనారాయణ
మా హక్కులను కాల రాస్తే సహించేది లేదు....
కుల బహిష్కరణ చేయడమేంటి ?
ఇంకా మనము ఏ కాలంలో ఉన్నాం
రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ
సిద్దిపేట న్యూస్
మా హక్కులను కాల రాస్తే సహించేది లేదని రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట లో మీడియా సమావేశంలో మాట్లాడారు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులను బహిష్కరించడంపై ఆయన మండిపడ్డారు. ఏ నాగరికతలో జీవిస్తున్నామని మా జాతి బిడ్డలను బహిష్కరించడమేంటి అన్నారు. స్వసంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన మా ముదిరాజులపై అణిచివేత ధోరణి మార్చుకో లేదన్నారు. మా ముదిరాజ్ బిడ్డలు మా చేపలు పట్టడం మా అక్కని ప్రశ్నించినందుకే వెలివేయడం ఏమైనా చర్య అన్నారు. తెలంగాణ పల్లె జిల్లాల్లో మా ముదిరాజ్ కులస్తులని గ్రామ బహిష్కరణలు వెలివేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. మా పోరాటం అహింస మార్గంలోనే మా హక్కులను సాధించుకుంటామన్నారు. ప్రభుత్వాము స్పందించకపోతే రాష్ట్రంలోని ముదిరాజులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యను వినిపిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి త్వరగా మా ముదిరాజులకు సొసైటీ ఏర్పాటు చేసి చెరువులను ముదిరాజులకు అప్పగించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్మన్ లింగాల పుష్పలత,రాష్ట్ర ముదిరాజ్ జేసి వైస్ చైర్మన్ లు పగిడాల సుధాకర్, జంగిటి శ్రీనివాస్ముదిరాజ్, ఉస్తేమ్ శ్రీనివాస్, జిల్లా చైర్మన్ గుంటుకు శ్రీనివాస్, వైస్ చైర్మన్ చికెన్ సత్తి, జిల్లా మీడియా ఇంన్ చార్జ్ పుప్పాల బాలేష్ ,తూప్రాన్ మండల చైర్మన్ ఇమాంపూర్ వెంకటయ్యా, వైస్ చైర్మన్ వెంగలి వెంకతేష్ , జనరల్ సెక్రెటరీ పిట్ల సాయిబాబా, ఖాజీపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పెండేలా గణేష్, ఖాజీపూర్ ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు
Apr 07 2024, 11:22