NLG: బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పాలకూరి రవి గౌడ్
నల్గొండ పట్టణంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ సంఘం జిల్లా అధ్యక్షులుగా పాలకూరి రవి గౌడ్ బాధ్యతలు చేపట్టినారు.
ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు.
జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ రాజకీయాలలో వెనుకబడి పోవడానికి కారణం బీసీలలో చైతన్యం లేకపోవడమేనని, చైతన్యం లేదనే కారణం చేత కొన్ని సామాజిక వర్గాలు బీసీలపై వివక్ష చూపిస్తున్నారు.
కులవృత్తులపై ఆధారపడ్డ బీసీ సామాజిక వర్గాలను ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేవు. చట్టసభలలో బీసీ ప్రాధాన్యతను లేకపోవడం కారణం చేత బీసీల హక్కుల గురించి మాట్లాడేవారు లేకపోయారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరం వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాళ్లకు తమ ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
మహాత్మా జ్యోతిబా పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసారని వారిని కొనియాడారు.
సమాజంలో అందరం అన్నదమ్ముల వలె ఐక్యత భావంతో ముందుకు పోవాలని, వెనుకబడిన కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కర్నాటి యాదగిరి రాజరికం నరసింహ చారి, చెరుకు మల్లికార్జున్ గౌడ్, జక్కల సుధాకర్ యాదవ్, బాసాని నరసింహ, నాగోజు నరేష్ చారి, శ్రీశైలం యాదవ్, శ్రీపాద జైశ్రీరామ్, కొండోజు వేణు, గడ గోజు విజయ్ చారి, వేముల దశరథ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Apr 06 2024, 14:28