NLG: జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు గా బాధ్యతలు చేపట్టిన రావిరాల కాశమ్మ
నల్లగొండ: పట్టణ కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు గా రావిరాల కాశమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు సహకరించిన నాయకులకి ధన్యవాదాలు అని తెలిపినారు.
నరేంద్ర మోడీ మహిళల శ్రేయస్సు కోరే గొప్ప ప్రధాని అని, అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండాలని ఉద్దేశంతో 32% రిజర్వేషన్ కల్పించినారని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని రాజకీయ రంగంలో కూడా రాణించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేయడానికి అందరం మమేకమై పార్టీ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ నివేదిత రెడ్డి , మునగాల సుధారాణి, కూతురు విజయ, కొప్పు జయశ్రీ ,దాసోజు అరుణ, కొండేటి భవాని, మద్ది, ప్రసన్న కవిత, బద్రమ్మ , మధు, శేఖర్, నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG

						






Apr 06 2024, 14:17
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
16.9k