NLG: చిన్న పత్రికల సమస్యలు పరిష్కరించాలి
![]()
నల్గొండ: చిన్న పత్రికల సంఘం కార్యాలయంలో, శుక్రవారం స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చిన్న పత్రికలకు నూతన ఎంపానెల్మెంట్, అక్రిడేషన్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని చిన్న పత్రికా జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
తదనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిని మరియు సహాయ కార్యదర్శి వెన్నమళ్ళ రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు గంగదారి వెంకటేశ్వర్లు, ఏ. మదనాచారి, ఫైనాన్స్ కమిటీ మెంబర్ వి. సుభాష్ రెడ్డి, గ్రీవెన్స్ కమిటీ మెంబర్ సుధీర్ కుమార్ లను స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ, ఉపాధ్యక్షులు దోసపాటి ముత్తయ్య, అన్నేబోయిన మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG

						






Apr 05 2024, 15:51
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
11.3k