నల్లగొండ జిల్లాలో ఘోరం జరిగింది...
బాధ్యత లేని అధికారులు.. వాటర్ ట్యాంకు లో కోతులు చనిపోగా.. ఆ నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు. ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో జరిగింది.
నందికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలో విజయ విహార్ ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు కనిపించాయి. అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న ఎన్ఎస్పి అధికారులు.. అదే నీటిని తాగుతున్న ప్రజలు.
వాటర్ ట్యాంక్ పై రేకులు ఉన్న మూత తెరిచి ఉంచడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. దాదాపు 30 నుండి 40 కోతులు చనిపోయినట్లు సమాచారం.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
Apr 04 2024, 08:08