NLG: ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి కి కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని, నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఈదులకంటి యాదగిరి రెడ్డి కి, ఇటివల హైద్రాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
సీనియర్ ప్రొఫెసర్ ఏవి.సతీష్ చంద్ర పర్యవేక్షణలో 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 12వ మరియు 13వ శాసనసభలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర' అనే అంశంఫై పరిశోధన చేసి పీహేచ్ది సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించినందుకు గాను, పీహేచ్ది డాక్టరేట్ అవార్డు పొందారు.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు, సమర్ధవంతమైన ప్రతిపక్ష పార్టీలు కూడా ఎంతో అవసరమని, ప్రతిపక్ష పార్టీలు వాటి పాత్రను చక్కగా నిర్వహించడం ద్వార ప్రభుత్వ విధానాలను ఎంతగానో ప్రభావితం చేయవచ్చని, ప్రజాభిప్రాయాని శాసనసభలో వ్యక్తికరించవచ్చని తన పరిశోధన ద్వార సూచించారు.
ఈయన స్వస్థలం యాదాద్రి జిల్లా, మోత్కూర్ మండలం, రాగిబావి గ్రామం. ఈ గ్రామం నుండి తొలి పీహేచ్ది డాక్టరేట్ అవార్డు పొందినందుకు వారి తల్లిదండ్రులు సత్తి రెడ్డి, పుష్పమ్మ, కుటుంబ సభ్యులు, మిత్రులు , గ్రామస్తులు ఎంతో హర్షం వ్యక్తం చేసారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NALGONDA DIST
Apr 03 2024, 16:37