భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం
మునుగోడు: మండల కేంద్రంలోని సిపిఐ ఆఫీసులో, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పాల్గొని మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తూ నాలుగు కోడ్ లుగా విభజిస్తున్నారు.
అందుకని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోవు పార్లమెంటు ఎలక్షన్ లో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని, అదేవిధంగా కార్మికులకు పని వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రమాద బీమా క్రింద 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మత్స్యకారులకు ఇచ్చినట్టుగా ప్రతి కార్మికునికి టు వీలర్ సైకిల్ మోటార్ వాహనాన్ని ఇవ్వాలని, గతంలో పెండింగులో వివిధ రకాల ఉన్న బిల్లులు, ఎక్స్గ్రేషియా ఇతర ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నరసింహ, దొమ్మాటి గిరి, యాసరాని వెంకన్న, బొల్లు సైదులు, భీమనపల్లి స్వామి, డి. నగేష్, ఉప్పు రమణయ్య, వి.ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Apr 02 2024, 10:25