NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్స్.. ముఖ్య అతిథిగా పాల్గొన్న బండమీది అంజయ్య
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 7 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో మిర్యాలగూడ ఫుట్బాల్ క్లబ్, నల్గొండ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 2-0 స్కోర్ తో నల్గొండ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా క్రీడాకారులకు నల్గొండ మండలం మర్రిగూడ జెడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు అందెం శ్రీనివాస్ గౌడ్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సేవా భావం కలిగిన వ్యక్తులను, సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ఈరోజు సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బండమీది అంజయ్య రావడం జరిగిందని, క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని వారు కూడా ఇక్కడ జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను పూర్తిగా గమనించి తనవంతుగా తనవంతుగా 6 ఫుట్బాలను క్రీడాకారులకు అందజేస్తామని ప్రకటించడం జరిగిందని తెలిపారు.
ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సమాచార హక్కు సంరక్షణ సమితి తెలంగాణ అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉచితంగా శిక్షణ ఇస్తూ, గ్రామీణ నిరుపేద విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులు గా తయారు చేశారని, ఇప్పుడు ఫుట్బాల్ క్రీడా వ్యవస్థను ఆయన చేత భూని పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో, నిరంతరం పనిచేస్తూ, నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారులకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ శిక్షణ కార్యక్రమాలు మరియు లీగ్ పోటీలను నిర్వహిస్తూ, ఫుట్బాల్ వ్యవస్థను సమాజంలోని ప్రతి వ్యక్తికి చేరవేసేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అది మన నల్లగొండ జిల్లాకే ఎంతో శుభసూచకుని దీని పర్యవసానమే గత 4 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లాకు చెందిన ఎంతోమంది ఫుట్బాల్ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తూ మంచి ఉజ్వల భవిష్యత్తు ను పొందే దిశగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.
ఫుట్బాల్ క్రీడాకారిని అప్పల సోనీ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో నేను గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొన్నానని భవిష్యత్తులో కూడా కోచ్ లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క భవిష్యత్తు కు బంగారు బాటలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, అంబటి ప్రణీత్ , సత్యం, కర్ణాకర్ రెడ్డి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Apr 01 2024, 21:16