NLG: వ్యాయామ ఉపాధ్యాయులు కీ. శే సాజిద్ అలీ కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ: ఇటీవల తల్లి, తండ్రి ని కోల్పోయిన పిల్లలకు 80,000/- వేలు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని DYSO మక్బూల్ మహమ్మద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కనగల్ జడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సాజిద్ అలీ సంస్మరణ సభను నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .

ఈ సందర్భంగా డివైఎస్ఓ మక్బూల్ మహమ్మద్ మాట్లాడుతూ.. 6నెలల క్రితం క్యాన్సర్ వ్యాధితో తల్లి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించడంతో ఆ పిల్లలు ఒంటరి వారిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మృతుని పిల్లలకు 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సహోదరుని కోల్పోవడం బాధాకరమని, సంఘ పరంగా ఆర్థిక సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సాజిద్ అలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం సాజిద్ అలీ కుమారుడు, కుమార్తెకు 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి కూతాటి మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు దుబ్బ ఆనంద్, ఆర్. నాగేశ్వరరావు, కోడుమూరు వెంకటరామిరెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, అలీమ్, శ్రీకాంత్ రెడ్డి, విజయపాల్, విజయ్, శ్రీనివాస్, రఫీ, వహీద్, గఫార్, కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Mar 31 2024, 18:56