ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం... రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం...
రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
అక్బర్ పేట/ భూంపల్లీ
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం భూంపల్లి గ్రామ ముదిరాజులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు దూరంగా ఉంటామని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దుబ్బాక నియోజకవర్గం ముదిరాజ్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఖాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులను గ్రామ బహిష్కరణ చేయడంపై మండిపడ్డారు. ఘాజీపూర్ గ్రామంలో సొంత రాజ్యాంగం ఉన్నట్లుగా అక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన చట్టబద్ధతను కూడా గ్రామస్తులు తుంగలో తొక్కి ముదిరాజ్ మధ్య సంపదపై మీకు హక్కు ఉండదని ఉకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ముదిరాజులను సామాజిక వెలివేతకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గారికి వచ్చే నెల ఒకటో తారీకు వరకు ముదిరాజులకు న్యాయం జరిగిందని అధికారిక ప్రకటన రాకుంటే ముదిరాజులం ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరి ఇందులో పాల్గొంటున్న రాజకీయ నాయకులపై ఆయా పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే ఆ పార్టీలను కూడా ముదురాజుల వద్దకు రానివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ సిద్దిపేట జిల్లా నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ పడిగా ప్రశాంత్ ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గం కన్వీనర్ చికెన్ సత్తి, దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట్ల మల్లేశం, ముదిరాజ్ నాయకులు రమేష్, భూపతి, గణేష్, నరసింహులు,
Mar 28 2024, 15:16