కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం! ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం!
ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
తేది: 22-03-2024 శుక్రవారం
కలెక్టరేట్ న్యూస్
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి మండల్ ఖాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కుటుంబాలను కొందరు భయభ్రాంతులకు గురిచేసి వెలివేశారు వెలువేద గురైన 30 ముదిరాజ్ కుటుంబాలు శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని మరియు పోలీస్ కమిషనర్ గారిని కలిసి వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా మేమోరాండం ఇచ్చారు విషయం తెలుసుకున్న ముదిరాజ్ ప్రతినిధులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సుతారి రాజు నియోజకవర్గ కన్వీనర్ పడిగే ప్రశాంత్ టౌన్ అధ్యక్షులు మిద్దె రవి ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ యూత్ కన్వీనర్ చెంది శ్రీనివాస్ నాయకులు కిష్ణపురం లక్ష్మణ్ యాట రాజేష్ పడిగే లింగం రాగులు రాజు చింతమడక రాజన్నలు వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మనుషులు మనుషులని వెలివేయడం ఏమిటని ఇది ఏమైనా రాచరిక పాలన అని ముదిరాజులు అంటేనే చులకనగా చూస్తూ చెరువులో చేపలు పట్టవద్దని సొసైటీలు చేసుకోవద్దని ఆంక్షలు విధించి గ్రామ బహిష్కరణ చేయడము ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు జీవో నెంబర్ 98/1964 ప్రకారం ముదిరాజులు మత్స్యకారులని మత్స్య సంపదపై చెరువులపై ముదిరాజ్లకు సర్వహక్కులు ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన జీవోని సైతం కాదంటూ గ్రామస్తులు కొంతమంది కవ్వింపు చర్యలు దిగుతూ ముదిరాజుల పైన గ్రామ బహిష్కరణ వేటు వేయడం సరైనది కాదన్నారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెలివేసినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని ముదిరాజులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలు ఉన్నారు
Mar 27 2024, 07:08