NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా అమరజీవి ధర్మ బిక్షం 13 వ వర్ధంతి
మర్రిగూడ: సిపిఐ మండల కార్యాలయంలో, నేడు అమరజీవి కామ్రేడ్ ధర్మబిక్షం 13 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. అమరులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 1922 ఫిబ్రవరి 15 జన్మించి , తన విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు పార్టీ కి ఆకర్షితులై, సాయుధ రైతాంగ, తెలంగాణ పోరాటం లో విరోచిత పోరాటం చేశారు. దున్నే వానికే భూమి, గీసే వానికే చెట్టు కావాలని జరిపిన పోరాటంలో 8 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి, అనంతరం జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులు గా, రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించారని, గీత కార్మికులకు సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత ధర్మ బిక్షం గారి దేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, జిల్లా యూత్ అద్యక్షుడు బూడిద సురేష్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు చెల్లం పాండు రాంగరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘమయ్య, ఐతగోని వెంకటయ్య, నిరంజన్, AISF ఏ.ఐ.ఎస్.ఎఫ్ మండల కార్యదర్శి ఇస్కీళ్ళ మహేందర్, సుభాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Mar 26 2024, 16:49