/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మునుగోడు మండలంలో బిజెపి పార్టీ బూత్ కమిటీ సమావేశం Mane Praveen
మునుగోడు మండలంలో బిజెపి పార్టీ బూత్ కమిటీ సమావేశం

మునుగోడు: మండలంలో కల్వలపల్లి, పులిపల్పల, జమస్తాన్ పల్లి గ్రామాలలో ఆదివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెంబళ్ల జానయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం వేణు కుమార్ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ హాజరు అయి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బూత్ లెవెల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి చంద్రకళ, మాదగోని నరేందర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముంగి ధనుంజయ, నియెజక వర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

శివన్నగూడ రిజర్వాయర్ పనులు అడ్డగింత

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామంలో, నిర్మాణంలో ఉన్నటువంటి రిజర్వాయర్ పనులను భూ నిర్వాసితులు శనివారం ఉదయం అడ్డుకున్నారు. భూ నిర్వాసితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని కోరారు. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు పై స్థాయి అధికారులకు విన్నవించి సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో నిరసన విరమించారు.

NLG: ముర్రుపాలు పట్టించడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: సూపర్వైజర్ పద్మ

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లలకు గంట లోపు తల్లిపాలు ముర్రుపాలు (తల్లిపాలు) పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు చాపల పద్మ, అండాలు ఆశాలు సైదాబీ, ఏర్పుల పద్మ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

అండర్-20 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ కు ముగ్గురు క్రీడాకారులు ఎంపిక

NLG: ఏప్రిల్ నెలలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరగబోయే అండర్-20 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు గాను, ఈరోజు నుండి 3 రోజుల పాటు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ జింఖానా ఫుట్బాల్ గ్రౌండ్స్ నందు రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్ ను నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ZPHS హైస్కూల్ నందు ఫుట్బాల్ కోచ్ లు గడసంతుల మధుసూదన్, మరియు మద్ది కరుణాకర్ పర్యవేక్షణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సెలక్షన్ ట్రయల్స్ ను నిర్వహించి ముగ్గురు ఫుట్బాల్ క్రీడాకారులు G.కుశాల్, మేకల దాసు, N.వెంకన్న లను ఎంపిక చేసినట్లు TFA రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

SB NEWS

NLG: రథోత్సవంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాంపల్లి: మండలంలోని తుంగపాడు గౌరారం గ్రామంలోని శ్రీ చలిదోన లక్ష్మీనరసింహస్వామి  ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఆలయంలో పండితులు స్వామి వారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అలంకరించిన ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గుట్ట పైకి పోవుటకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తానని, గుట్ట చుట్టూ డబల్ రోడ్డు వేయిస్తానని మండలాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అన్నారు. రథోత్సవంలో భక్తులు పోటాపోటీ పడి రధం లాగ గా  మహిళలు రథం ముందు నీళ్లు ఆరబోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, గుంటూరు జిల్లాల నుండి  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ చలిదోన లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పులకరం వెంకటయ్య, నాంపల్లి జెడ్పిటిసి ఏలుగోటి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, కొమ్ము బిక్షం, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, చిలుకూరి బిక్షం, మాజీ సర్పంచ్ దుర్గయ్య, గుండాల అంజయ్య, పూల యాదగిరి, సుధాకర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, ఈద శేఖర్, కోరే శివ, తదితరులు పాల్గొన్నారు.
NLG: కుదాబక్షుపల్లి మరియు వెంకేపల్లి గ్రామపంచాయతీ లలో పోషణ పక్వాడ అవగాహన కార్యక్రమాలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని కుదాబక్షుపల్లి మరియు వెంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పోషణ పక్వాడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బండకిండి తండ, వేంకేపల్లి తండాలలో స్థానికులచే ప్రాంతీయ పౌష్టికాహారం తయారు చేసి ప్రదర్శించారు. కుదాబక్షుపల్లిలో శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు.

సిరి ధాన్యాలు ప్రాముఖ్యత, పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకత, 2 సం.లోపు పిల్లల కు ఇవ్వాల్సిన ఆహారం, సంరక్షణ, గర్భిణీ సమయంలో ధ్యానం వలన ఉపయోగాలు పై సీడీపిఓ లావణ్య కుమారి కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు.

సూపర్వైజర్ పద్మ, వెంకెపల్లి తండ పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ బాబు, ఏఎన్ఎం సునీత, కళావతి, అంగన్వాడి టీచర్స్ విఘ్నేశ్వరీ, విజయలక్ష్మి, సుగుణ, సులోచన, అలివేలు మరియు తల్లులు పాల్గొన్నారు.

NLG: పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలి, లేనిపక్షంలో నిరవధిక సమ్మె తప్పదు: AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

నల్లగొండ: ఎన్ హెచ్ ఎం స్కీంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పెండింగులో ఉన్న వేతనాలు మరియు 7 నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలి, లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో సూపరిండెంట్ మంజులత కు సమ్మె నోటీసు ఇచ్చారు. 

ఈ సందర్భంగా AITUC ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలల వేతనాలు మరియు పిఆర్సి ఏరియర్స్, ఏడు నెలల డబ్బులు చెల్లించాలని అనేక రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ నెల 22వ తేదీ లోపు వేతనాలు ఏరియర్స్ బకాయిలు చెల్లించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే కార్మికులకు వేతనాలు అందించడం లేదని అన్నారు.

ఎన్హెచ్ఎం స్కీంలో దాదాపు ఆల్ క్యాడర్స్ 2వ ఎఎన్ఎంలు, ఆర్బీఎస్కె డాక్టర్లు, ఎం.ఎల్.హెచ్.పిలు, అర్బన్ హెల్త్ సెంటర్ సి.ఓ., అకౌంటెంట్, ఎంఎన్ఏ, వాచ్మెన్ మరియు స్వీపర్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్, స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్, డిఇఓ, కాంటిజెంట్ వర్కర్స్, లాంటి దాదాపు 78 క్యాడర్లలలో సుమారు 17,514 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఈ ఉద్యోగులు నిత్యం క్రింది స్థాయి ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అనేక ప్రాంతాల నుండి విధులకు హాజరవుతుంటారని అన్నారు.

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరు పేద, మధ్య తరగతి చెందినవారు. ప్రతినెలా 1వ తేదీన జీతం అందితే తప్ప వారి కుటుంబాలు నడవని పరిస్థితి లేదు. గత 2 నెలలుగా జీతాలు అందకపోవటంతో కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉన్నదని, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఇట్టి విషయమై గతంలో అనేక సందర్భాలు జిల్లా స్థాయి అధికారులకు వినతులు ఇవ్వటం జరిగింది. కానీ నేటి వరకు ఒక్క నెల జీతాలు మాత్రమే చెల్లించారని అన్నారు.

ఎన్హెచ్ఎం ఉద్యోగులకు పిఆర్సి విడుదలైన సందర్భంగా ఇవ్వవల్సిన 7 నెలల ఏరియర్స్ సైతం నేటికి కూడా చెల్లించలేదు. కావున ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఎన్హెహెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి అవకాశం ఉంటుంది.తక్షణం జీతాలు చెల్లించనిచో సమ్మె తప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో 2వ ANM యూనియన్ జిల్లా నాయకులు రాయల గీతా రాణి, చిత్రం సరిత, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

.

NLG: ఇందుర్తి లో పోషణ పక్షం కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, మేటి చందాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇందుర్తి అంగన్వాడి కేంద్రంలో, పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకత, చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అదేవిధంగా పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. అనంతరం తల్లులందరిచేత పోషణ పక్షం ప్రతిజ్ఞ చేయించారు. సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు అనంతలక్ష్మి, పద్మ, ఆయాలు, ఆశ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

NLG: మొక్కలు నాటిన NSS విద్యార్థులు

నల్లగొండ జిల్లా, నకిరేకల్ ప్రభుత్వం డిగ్రీ కళాశాల NSS యూనిట్ 1 ఆధ్వర్యంలో, ఈరోజు చందంపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా NG కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్యోగం, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలకు ఎలా రాయాలి అనే స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. అదేవిదంగా ఉచిత పుస్తకాలు పంపిణి చేశారు. 

ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి సమాజంలో తమ చదువుతో పాటు స్వచ్ఛమైన పరిసరాలు, చెట్టు పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రిన్సిపాల్ తెలియజేసారు.

వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ హబీబ్, Dr. శేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిత, G.శంకర్, సురేందర్, సురేష్ గౌడ్, జానయ్య, శ్రీను, ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. 

TG: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా చేశారని.. ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

పదేళ్లలో ఏనాడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేవలం ఎన్నికలకు ముందు రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని, రెండో మారు జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. మూడోసారి కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేసిన నేతలు, ఇవాళ తమను తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేశారు.