NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో, ఈ రోజు స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం నిర్వహించారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్ తెలిపారు .
ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమం లో గ్రంథాలయం ముందు మరియు గ్రంథాలయ పరిసరాలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను వాలంటీర్లు తీసివేశారు అని మన కళాశాల మన గ్రంథాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.
కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు, పత్రికల విభాగం ఒక క్రమ పద్ధతిలో ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు అమర్చారు. రీడింగ్ హాల్ ఆవరణలో అనవసరమైనటువంటి చెత్త ను తీసివేశారు. ఆ తరువాత గ్రంథాలయం ముందున్నటువంటి గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పెట్టారు. మన కళాశాల మన గ్రంథాలయం స్వచ్ఛ గ్రంథాలయంగా ఉండాలని అటువంటి ఉద్దేశంతో ఈరోజు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు ఈ యొక్క జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని గ్రంథాలయాన్ని మరియు గ్రంధాల ఆవరణంలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగుల వేణు, మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, సూదిని వెంకట్ రెడ్డి లైబ్రరీ రికార్డు అసిస్టెంట్, రేణుక మరియు ఎన్ఎస్ఎస్ మహిళా విభాగం యూనిట్-4 విద్యార్థినిలు పాల్గొని ఈ స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Mar 19 2024, 18:04