NLG: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల క్షేత్ర పర్యటన
నల్గొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన 109 మంది విద్యార్థినిలు జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం , సూక్ష్మజీవ శాస్త్రం మరియు గ్రంథాలయ శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం ఏర్పాటు చేసిన క్షేత్ర పర్యటన లో భాగంగా చర్లపల్లి దగ్గర గల అంజన శ్రీ నాచురల్ ఫామింగ్ క్షేత్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న వై.అంజిరెడ్డి విద్యార్థినిలకు వారి క్షేత్రంలో పెంచుతున్న వివిధ మొక్కలు, జంతువుల గురించి, సమీకృత వ్యవసాయం గూర్చి, జీవ వైవిధ్య ప్రాముఖ్యత గూర్చి వివరంగా తెలియ జేశారు. అంతే కాకుండా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా సహజ పద్దతుల ద్వారా పంటలను ఎలా పెంచుతారో విద్యార్థులకు వివరించారు. తన క్షేత్రంలో పెంచుతున్న గొర్రెలు, వివిధ రకాల దేశవాళీ కోళ్ళ పెంపకం మరియు వాటి నిర్వహణ గూర్చి విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ విభాగాల అధిపతులు డా. కె.శ్రీనివాస రెడ్డి (వృక్షశాస్త్రం), డా.రావిరాల నరేష్ (జంతుశాస్త్రం), కె.దేవవాణి (సూక్ష్మ జీవ శాస్త్రం), అద్యాపకులు జె.స్వామి, ఎ.సంధ్య, జి.సరిత, మిస్కిన్ తరన్నుమ్, కె.వనజ, పి.సునీత, అతుఫా మరియు లైబ్రరీ విభాగ అధిపతి సుంకరి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.
Mar 17 2024, 11:29