/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: లక్కీ డ్రా లో ఒకటో తరగతి అడ్మిషన్ కు ఎంపికైన చిన్నారి ఆరాధ్య Mane Praveen
NLG: లక్కీ డ్రా లో ఒకటో తరగతి అడ్మిషన్ కు ఎంపికైన చిన్నారి ఆరాధ్య

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్నారి చిట్యాల ఆరాధ్య.. హైదరాబాద్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ పొందింది. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ తరఫున 43 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా లక్కీ డ్రా పద్ధతిలో ఆరాధ్య ఎంపికైంది. ఆమెతోపాటు మరో విద్యార్థిని కూడా ఎంపిక చేశారు. అదేవిధంగా బేగంపేట పబ్లిక్ స్కూల్ కు ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆరాధ్య తల్లిదండ్రులు కవిత గోపాల్ మాడుగుల పల్లి మండలం, కల్వల పాలెం వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ పేద విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ ఈ అవకాశం కల్పించింది.

NLG: పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ఆశా వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం

మర్రిగూడ: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆశ వర్కర్స్ సమస్యలపై, లెప్రసీ సర్వే బిల్లుల చెల్లింపు గురించి, పీహెచ్సీలో డాక్టర్ ప్రణయ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ గత ప్రభుత్వం ఆదేశించినటువంటి సర్వేను అనేక కష్టనష్టాలను కోర్చి జయప్రదంగా నిర్వహించారు, కానీ వారికి గత రెండు సంవత్సరాలు లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. సర్వే చేసిన బిల్లు లు రాలేదు, మళ్లీ ఇప్పుడు సర్వే చేస్తున్నాము. కాబట్టి పెండింగ్ బిల్లు వెంటనే ఇవ్వాలని, లెప్రసీ సర్వే చేసే టైము ను మార్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకురాలు ఏర్పుల పద్మ, పగడాల బాలమణి, ఆంబోతు రోజ తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు.

NLG: పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ అందజేసిన డా.కృష్ణ చైతన్య

నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సింధూర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో, 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు దాతలు అందించిన సహకారంతో చదువుల యందు శ్రద్ద ఆసక్తులను కనబర్చి , సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NLG: శివన్నగూడెం లో పోషణ పక్వాడ కార్యక్రమం

NLG: శివన్నగూడెం లో పోషణ పక్వాడ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, శివన్నగూడెం గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిరిధాన్యాలు, పూర్వ ప్రాథమిక విద్య పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

6 సం.లోపు పిల్లలకు మెదడు అభివృద్ధి 80% వరకు ఉంటుందని, ఈ వయసులో పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం చాలా అవసరం అని తెలిపారు. సూపర్వైజర్ పద్మ అంగన్వాడీ టీచర్లు విజయశ్రీ, సువర్ణ, అనసూర్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కంజర శ్రీను

నల్లగొండ జిల్లా: 

తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లగొండ జిల్లాకు చెందిన కంజర శ్రీను ను నియమించారు. ఈ సందర్భంగా కంజర శ్రీను మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించి, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ మరియు తెలంగాణ కళావేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు, తోటి కళాకారులకు ధన్యవాదాలు అని తెలిపారు.

TG: భువనగిరి పార్లమెంటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా నూనె వెంకట్ స్వామిని ప్రకటించిన బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర కమిటీ

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) తరఫున ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామిని, శుక్రవారం భువనగిరి పార్లమెంటు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారని బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ ప్రకటించారు

ఈరోజు హైదరాబాదులోని ఓంకార్ భవన్లో జరిగిన బిఎల్ఎఫ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ, ఆధిపత్య పార్టీ లను ఓడించి, కార్మిక వర్గ ప్రయోజనం కోసం, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న బిఎల్ఎఫ్.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేయనున్నదని తెలిపారు. ప్రస్తుతం ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని,

భువనగిరి పార్లమెంట్ కు ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి,

నల్లగొండ పార్లమెంటుకు ఎంసిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య,

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎం సి పి ఐ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్,

జహీరాబాద్ నియోజకవర్గానికి బి ఎల్ పి రాష్ట్ర నాయకుడు వడ్ల సాయి కృష్ణ చారి,

నిజామాబాద్ నియోజకవర్గానికి బిఎల్పి రాష్ట్ర నాయకుడు అబ్బగాని అశోక్ గౌడ్

పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ యొక్క అభ్యర్థులుగా పోటీలో ఉంటారని బహిరంగంగా ప్రకటిస్తున్నామని, త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎం సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాయబడి పాండురంగ చారి, ప్రజా పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఉయ్యాల లింగ స్వామి గౌడ్, అరూరి సత్తయ్య ప్రజాపతి, మోతె చంద్రమౌళి కురుమ, గార లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: నాంపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కత్తి రవీందర్ రెడ్డి

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన కత్తి రవీందర్ రెడ్డి ని, మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ, శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి నియామక పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాంపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అన్నారు.

మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాం, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, కొమ్ము బిక్షం, గజ్జల శివారెడ్డి, పెద్దిరెడ్డి రాజు, ఈద శేఖర్, పానుగంటి వెంకటయ్య, ఎస్.కె చాంద్ పాష, పానుగంటి వెంకన్న, దోటి శంకర్ యాదవ్, చిలుకూరి బిక్షం, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, గుండాల అంజయ్య, సుధాకర్ రెడ్డి, ముష్టిపల్లి ఎంపిటిసి బుజ్జి చందు, భతూల వంశీ, అంగిరేకుల పాండు, కోరే యాదయ్య, వీరమల్ల శ్వేతా నాగరాజు, దండిగ నరసింహ, దోటి పరమేష్ యాదవ్, పులికుంట్ల విజయ్, బుషిపాక సంజీవ, ఎరెడ్ల సంజీవరెడ్డి, కోరే శివ, దండిగ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: రూ. 67 కోట్ల ఆర్ అండ్ బి రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి


నల్లగొండ జిల్లా:

నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో సుమారు రూ. 67 కోట్ల విలువచేసే ఆర్ అండ్ బి రహదారుల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే పేద మహిళకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వానకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు అందిస్తామని తెలిపారు.

తెలంగాణలో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ ఎల్పిజి కనెక్షన్, సొంత స్థలం ఉన్చ వారికి 5 లక్షల రూపాయ లతో ఇందిర ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డిఓ రవి, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: రామన్నపేట బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్షీరాం 90వ జయంతి

రామన్నపేట: ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 90వ జయంతి సందర్భంగా, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావురాల నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ వర్గాలు అక్షరానికి, సంపదకు, అధికారానికి దూరంగానెట్టివేయబడ్డాయి.ఈ వర్గాలను బహుజన మహనీయుల సిద్ధాంతంతో రాజకీయంగా ఏకం చేసి అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన యోధుడు కాన్షీరాం అని అన్నారు.

బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి ఉద్యోగులను, మేధావులను, విద్యార్థులను, ప్రజలందరిని ఏకం చేసి బహుజనులకు అధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించిన మహోన్నత రాజకీయ శిఖరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్ మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ పాల్గొన్నారు.

NLG: విద్యార్థి దశ నుండే మంచి విలువలను పెంపొందించుకోవాలి: డీఎంహెచ్ఓ కొండల్ రావు

నల్గొండ పాతబస్తీ మాధవ్ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో, ఈరోజు 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ ప్రోగ్రాం కు ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జీవిత విలువలను పాఠశాల దశ నుండి పెంపొందించుకోవాలని తెలియజేస్తూ మంచి విలువలను, దేశంపై భక్తి భావనను, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయత లను, కుటుంబ విలువలను, గురువుల పట్ల భక్తి భావనను, సమాజం పట్ల అవగాహనను, ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.