TG: భువనగిరి పార్లమెంటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా నూనె వెంకట్ స్వామిని ప్రకటించిన బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర కమిటీ
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) తరఫున ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామిని, శుక్రవారం భువనగిరి పార్లమెంటు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారని బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ ప్రకటించారు
ఈరోజు హైదరాబాదులోని ఓంకార్ భవన్లో జరిగిన బిఎల్ఎఫ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ, ఆధిపత్య పార్టీ లను ఓడించి, కార్మిక వర్గ ప్రయోజనం కోసం, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న బిఎల్ఎఫ్.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేయనున్నదని తెలిపారు. ప్రస్తుతం ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని,
భువనగిరి పార్లమెంట్ కు ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి,
నల్లగొండ పార్లమెంటుకు ఎంసిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య,
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎం సి పి ఐ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్,
జహీరాబాద్ నియోజకవర్గానికి బి ఎల్ పి రాష్ట్ర నాయకుడు వడ్ల సాయి కృష్ణ చారి,
నిజామాబాద్ నియోజకవర్గానికి బిఎల్పి రాష్ట్ర నాయకుడు అబ్బగాని అశోక్ గౌడ్
పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ యొక్క అభ్యర్థులుగా పోటీలో ఉంటారని బహిరంగంగా ప్రకటిస్తున్నామని, త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎం సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాయబడి పాండురంగ చారి, ప్రజా పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఉయ్యాల లింగ స్వామి గౌడ్, అరూరి సత్తయ్య ప్రజాపతి, మోతె చంద్రమౌళి కురుమ, గార లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Mar 15 2024, 23:13