NLG: రామన్నపేట బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్షీరాం 90వ జయంతి
రామన్నపేట: ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 90వ జయంతి సందర్భంగా, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావురాల నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ వర్గాలు అక్షరానికి, సంపదకు, అధికారానికి దూరంగానెట్టివేయబడ్డాయి.ఈ వర్గాలను బహుజన మహనీయుల సిద్ధాంతంతో రాజకీయంగా ఏకం చేసి అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన యోధుడు కాన్షీరాం అని అన్నారు.
బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి ఉద్యోగులను, మేధావులను, విద్యార్థులను, ప్రజలందరిని ఏకం చేసి బహుజనులకు అధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించిన మహోన్నత రాజకీయ శిఖరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్ మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ పాల్గొన్నారు.








నల్లగొండ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ పర్యవేక్షణ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్ కు, ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని గజల్ ప్రక్రియలో ప్రకటించింది.
ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు పెరిక మధు ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెరిక మధు మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రామ్మూర్తి ఈ విషయాన్ని ప్రకటించారని, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా ఈనెల 20న పురస్కారాన్ని అందుకోనున్నారని తెలిపారు.
SB NEWS TELANGANA










Mar 15 2024, 19:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.8k