NLG: నల్లగొండ మున్సిపాలిటీ ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 55 కోట్ల టిఎఫ్ ఐడిసి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రూ. 600 కోట్లలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని అన్నారు.
6 లైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని పట్టణ ప్రజలకు తాగునీరు వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామని, రూ. 20 కోట్లలతో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.
రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని మంత్రి ఆదేశించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరు కాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. మే, జాన్ నెలలో మరో జాబ్ మేళ ను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 13 2024, 20:25