NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల లోని మహిళా సాధికారత విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సమూద్రాల ఉపేందర్, కన్వీనర్ గా డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి వ్వహరించగా ముఖ్య అతిధిగా ప్రముఖ నటి,ఇండిఫేమ్ సిఇఒ దాస్యం గీతా భాస్కర్, గౌరవ అతిధి గా జిల్లా ఎస్పీ చందనా దీప్తి హాజరయి విద్యార్థులకు దిశానిర్దేశం చేసారు.
గీతా భాస్కర్ మాట్లాడుతూ.. ఆడ, మగ మద్య ఉండాల్సింది హక్కుల కోసం పోరాటం కాదు అవగాహన తో కూడిన ప్రోత్సాహకం అని, స్త్రీలు పరిస్థితులకు భయపడకుండా జీవితాన్ని ఒక లక్ష్యం తో తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఎస్ పి చందనా దీప్తి మాట్లాడుతూ.. ఆడవారు ఆర్థికంగా స్వతంత్రత కలిగి ఉండాలని, ఇటు కుటుంబ పాలన అటు కెరియర్ రెండింటిని సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఆడవారికి మాత్రమే మనోధైర్యం ఎక్కువ అని అభివర్ణించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు అన్ని రంగాలలో దూసుకుని పోవాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆట పాటలతో కార్యక్రమమంతా చాలా ఆహ్లాదకరంగా సాగింది. ఆ తర్వాత ఆటల పోటీలు ఇతర కల్చరల్ పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి మరియు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో లైబ్రరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేశం, డాక్డర్ దీపిక, సి.శివరాణి, శిరీష, సావిత్రి, సరిత, మహేశ్వరి, సంద్యా, శ్వేత, కవిత, రజని, ఆష్రఫ్, యాదగిరి రెడ్డి, సుధాకర్, వేణు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Mar 08 2024, 16:00