NLG: జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల
నల్లగొండ: ఎన్జీ కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ కళాశాల కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్ ను ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. అదేవిధంగా పిచ్చి మొక్కలు తొలగించినారు, చెట్లకు పాదులు చేసి నీరు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగుల వేణు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరిగింది .
కళాశాల ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, విద్యార్థులు పూర్తిగా ప్లాస్టిక్ వాడడం మానేయాలని. భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మున్నీర్ డాక్టర్ శీలం యాదగిరి, యాదగిరి రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తిరుమలేష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Mar 06 2024, 19:19