/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల Mane Praveen
NLG: జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల

నల్లగొండ: ఎన్జీ కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ కళాశాల కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్ ను ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. అదేవిధంగా పిచ్చి మొక్కలు తొలగించినారు, చెట్లకు పాదులు చేసి నీరు పోయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగుల వేణు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరిగింది .

కళాశాల ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, విద్యార్థులు పూర్తిగా ప్లాస్టిక్ వాడడం మానేయాలని. భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మున్నీర్ డాక్టర్ శీలం యాదగిరి, యాదగిరి రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తిరుమలేష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

NLG: రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో బెస్ట్ డిఫెండర్ గా కుంటిగొర్ల కోటేష్

నిన్నటి వరకు నాగార్జునసాగర్ లో జరిగిన 70వ రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు ఛాంపియన్షిప్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన నల్గొండ చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ కు చెందిన కుంటిగొర్ల కోటేష్ రాష్ట్రస్థాయిలో బెస్ట్ డిఫెండర్ గా అవార్డును స్వీకరించాడని క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.  

క్లబ్ కు చెందిన సాయికిరణ్, వేణు, కోటేష్, శ్రీకాంత్, సందీప్ (5 మంది క్రీడాకారులు ) క్లబ్ లో కబడ్డీ క్రీడా ఓనమాలు దిద్దుకొన్నారని తెలియజేస్తూ.. ప్రతినిత్యం సాధన చేస్తూ, కబడ్డీ క్రీడల్లో నైపుణ్యం సాధించి జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికైనారని, వీరందరూ సాయ్ హైదరాబాద్ అకాడమీ నందు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా క్రీడాకారులకు అద్భుతమైన శిక్షణ ఇస్తున్న సాయ్ అకాడమీ మరియు క్రీడాకారుల్లో ఉన్న సహజ నైపుణ్యాన్ని వెలికిదీస్తున్న రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

TS: ఈనెల 7న.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన 'మహిళా వృద్ధాప్య ఆశ్రమం' ప్రారంభోత్సవం

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

జనగాం లో తొలుత 144 మంది వృద్ధులు నివాసం ఉండేలా రూ. 14 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమంను.. ఈ నెల 7న మంత్రులు సీతక్క, కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు, ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఫౌండేషన్ చైర్ పర్సన్ కోరారు.

NLG: ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు

నల్లగొండ: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ నంబర్, విద్యుత్తు వినియోగదారుల నంబర్ తదితర వివరాలను సరి చేసేందుకు, ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, రాష్ట్ర ఎనర్జీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వి, జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు.

NLG: పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్

నల్లగొండ: పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

మంగళవారం జిల్లా టాస్క్ ఫోర్స్ టీం, నాంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో మెల్లవాయి గ్రామం వద్ద తనిఖీ చేయగా అశోక్ లేలాండ్ ట్రాలీ, ఆటో మహీంద్రా బొలెరో ట్రాలీ లలో 75 కింటాల్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కు సిద్ధంగా ఉంచిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

NLG: ట్రాక్టర్ దొంగలించిన నిందితుడు అరెస్టు

దేవరకొండ: ట్రాక్టర్ ను దొంగిలించిన నిందితుని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణంలో ఫిబ్రవరి 19న మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ట్రాక్టర్ ను, మైనంపల్లి గ్రామం కి చెందిన పులిజాల గణేష్ దొంగలించాడు. దొంగలించిన ట్రాక్టర్ ను హాలియా సమీపంలో రైస్ మిల్ లో పెట్టాడు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకొని, కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.

TS: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా: గుజరాత్‌లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా పదేళ్లలో రామగుండం ఎన్టీపీసీ లో 1600 మెగా వాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ కూడా డెవలప్ కావాలని ఆకాంక్షించారు.

NLG: బైక్ ను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

చింతపల్లి: మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై మదనాపురం గేటు సమీపంలో, బైక్ పై వెళుతున్న పాండురంగారెడ్డి ని డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్ హరిచందన

నల్లగొండ: జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 

నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి, వాటి పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లా స్థాయితో పాటు, కిందిస్థాయి అధికారులు సైతం ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

NLG: గృహజ్యోతి లబ్ధిదారుల తో ముఖాముఖి మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుండి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద 200 రూపాయల లోపు బిల్లులు వచ్చిన అర్హులైన పేద వారికి విద్యుత్ బిల్లుల మాఫీ, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ వంటివి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఈ రోజూ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడారు. గృహజ్యోతి పథకం కింద నల్గొండ జిల్లాలో లక్ష 82 వేల మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. 200 రూపాయల లోపు విద్యుత్ బిల్లులు వచ్చే అర్హులైన గృహ జ్యోతి లబ్ధిదారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది అన్నారు. 10 రోజుల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని, ముఖ్యంగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని చూపించి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో మామిళ్ళ గూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

3 నెలల్లో మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామని, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్ , డిఇ వెంకటేశ్వర్లు, ఏ డి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు