NLG: ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వడ్డేపల్లి గ్రామ వాసి బుషిపాక సునీత
![]()
నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బుషిపాక. సునీత ఇటీవల వెలువడిన గురుకుల పరీక్ష ఫలితాల్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన సునీత.. చిన్నప్పటి నుండి చదువుల్లో తనకు ఉన్న జిజ్ఞాసను గమనించిన ఆమె తల్లిదండ్రులు బుషిపాక సాలమ్మ- రాములు, పై చదువులు చదువుటకు ప్రోత్సాహించారు.
ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త డాక్టర్ జి.వంశీధర్ సహకారంతో పరీక్షలకు సన్నద్దమై D.L, J.L ఉద్యోగాలు సాధించడంతో పలువురు అభినందించారు. తన విజయంలో కుటుంబం, స్నేహితులు, గ్రామస్థుల సహకారం ఉన్నదని సునీత తెలిపింది.

						











 





Mar 02 2024, 17:57
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
57.0k