/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: రోడ్డు పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలి Mane Praveen
NLG: రోడ్డు పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలి

నల్గొండ జిల్లా, నేరేడు గుమ్మ మండలం లో గత ఆరు నెలల క్రితం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద శాంక్షన్ అయినటువంటి రోడ్లను పేర్వాల నుండి పందిరిగుండ తండా వరకు, మెటల్ కంకర పరిచి, రోడ్డు పని పూర్తి చేయక పోవడం వల్ల, గత సంవత్సరం నుండి స్థానికంగా గ్రామస్తులు రోడ్డుపై వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

టూ వీలర్ వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైతులు వెళ్లేందుకు రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేసి, ఆర్ అండ్ బి అధికారులు మరియు రోడ్డు కాంట్రాక్టు ప్రజలకు పూర్తిస్థాయిలో రోడ్డు సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

SB NEWS

NLG: రైతు మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి: మేడి ప్రియదర్శిని

కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్ అనే రైతు మరణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రైతుల పై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాడి చేసి రైతులను చంపడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. ఫిబ్రవరి 21న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతాంగం పై పంజాబ్, హర్యానా సరిహద్దు ఖీ నౌరి వద్ద రైతాంగం పై పోలీసు యంత్రాంగం జరిపిన పాశావిక దాడులలో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి సంతానం సంతాపాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

పోలీస్ కాల్పుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి, పోలీసు కాల్పుల్లో క్షత్రగాత్రులైన రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి వారిని ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందని అన్నారు.

TS: బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది ఎంక్వైరీ లో తెలుసుకుని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలం ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

NLG: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ నియామకం పట్ల హర్షం

నల్లగొండ జిల్లా:

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కే. శ్రీనివాస్ రెడ్డి ని నియమించడం పట్ల, నాంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి మండలం ప్రెస్ క్లబ్ కార్యదర్శి గాలెంక వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.

TS: ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

HYD: ధరణి లో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. అప్పుడు కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. 

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు. 

భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు.

TS: సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నాయకులు

తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జి.ఏడి ఆదేశాలను అనుసరించి ప్రణాళిక బద్ధంగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బి. శ్యామ్, ఉపాధ్యక్షులు ఏ.జగన్మోహన్ రావు, కోశాధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఏ. పరమేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధి జి.దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం. రామకృష్ణ గౌడ్, కార్యనిర్వాహక సభ్యుడు పి.యాదగిరి గౌడ్, సలహాదారులు టి.రవీందర్ రావు, జి. పురుషోత్తం రెడ్డి, వి. సురేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లలో ఒకటైన సత్వరమే పార్లమెంట్ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని వారు కోరారు. ఈ - కుబేరు లో ఉన్న బిల్లుల విడుదల, పెండింగ్లో ఉన్న డిఏ ఎరియల్స్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మరియు మంత్రులు

మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు దామరచర్ల మండలంలో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నక్కగూడెంలో రూ. 37 కోట్లతో 3,200 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ కు, హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో 400 కోట్ల ఇన్నోవేరా కంపెనీ లైఫ్ సైన్సెస్ ప్లాంట్ లకు శంకుస్థాపనలు చేశారు.

NLG: చత్రపతి శివాజీ (CSL) జిల్లాస్థాయి ఫుట్బాల్ లీగ్ పోటీలు

నల్గొండ మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నామని క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. గ్రాస్ రూట్ ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో 8 నుండి16 సంవత్సరాల లోపు బాల బాలికలు లీగ్స్ లో పాల్గొనటానికి మద్ది కరుణాకర్ ఫుట్బాల్ కోచ్ సెల్ నెంబర్ 9492572900 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

NLG: దామరచర్లకు రానున్న ఉపముఖ్యమంత్రి, మంత్రులు

నల్గొండ జిల్లా:

దామ‌ర‌చర్ల‌లోని యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటును శనివారం రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సందర్శించానున్నారు. నిన్న సందర్శించాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడి ఈ రోజుకి షెడ్యూల్ మారింది.

దామ‌ర‌చ‌ర్ల‌కు ఇవాళ ఉదయం గం.09.45 ల‌కు చేరుకుంటారు. మంత్రులు ఉత్త‌మ్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిల‌తో క‌లిసి ప‌వ‌ర్ ప్లాంటును సంద‌ర్శించి, అక్క‌డ జ‌రుగుతున్న పురోగ‌తి ప‌నుల‌ను ప‌రిశీలించి సమీక్ష నిర్వహిస్తారు.

NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

నల్గొండ జిల్లా:

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిబ్రవరి 24 న నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

మర్రిగూడ మండలంలో ఉదయం గం. 11:30 లకు సరంపేట శ్రీ స్తంబగిరి లక్ష్మి నరసింహ స్వామి జాతర కార్యక్రమంలో, మధ్యాహ్నం గం. 12:30 లకు నాంపల్లి మండలంలోని గాంధీజీ పాఠశాలలో 3వ వార్షిక కార్యక్రమంలో పాల్గొననున్నారు.