TS: సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నాయకులు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జి.ఏడి ఆదేశాలను అనుసరించి ప్రణాళిక బద్ధంగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బి. శ్యామ్, ఉపాధ్యక్షులు ఏ.జగన్మోహన్ రావు, కోశాధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఏ. పరమేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధి జి.దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం. రామకృష్ణ గౌడ్, కార్యనిర్వాహక సభ్యుడు పి.యాదగిరి గౌడ్, సలహాదారులు టి.రవీందర్ రావు, జి. పురుషోత్తం రెడ్డి, వి. సురేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లలో ఒకటైన సత్వరమే పార్లమెంట్ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని వారు కోరారు. ఈ - కుబేరు లో ఉన్న బిల్లుల విడుదల, పెండింగ్లో ఉన్న డిఏ ఎరియల్స్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Feb 25 2024, 09:35