TS: తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్: రవీంద్ర భారతి మినీ ఆడిటోరియం లో ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా టీజీ సీజీటీఏ డైరీ మరియు తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యాభివృద్ధి కోసం తలపెట్టిన అడ్మిషన్స్ క్యాంపెనింగ్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు డాక్టర్ N.గోపి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గత ఏడు సంవత్సరాల క్రితం ప్రభుత్వ కళాశాలలో విద్య అభ్యసించే వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 70,000 కలదు. కానీ ఈ అడ్మిషన్ క్యాంపెనింగ్ ప్రక్రియలో భాగంగా ఈ సంవత్సరానికి ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య 1,50,000 కు చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ అసోసియేషన్ రూపొందించిన అడ్మిషన్ క్యాంపెనింగ్ వల్ల మాత్రమే సాధ్య పడింది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల కంటే ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించి విద్యార్థిని విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.


ఈ యొక్క డైరీలో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన అన్ని రకాల జీవోలు మరియు అధికారుల నెంబర్లు మరియు ముఖ్యమైన సమాచారం పొందుపరచబడింది. ప్రతి ఒక్క ప్రభుత్వ కళాశాల అధ్యాపకునికి ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.సురేందర్ రెడ్డి తెలిపారు.

సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎన్ గోపి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను జాయిన్ చేసుకునే ప్రక్రియ బాధ్యత ప్రతి ఒక్క అధ్యాపకుడి భుజస్కందాలపై ఉందని తెలిపారు. సంఘ గౌరవ సలహాదారు డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను బోధిస్తూనే డ్రాప్ అవుట్స్ పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జే చిన్న, లేడీస్ సెక్రటరీ పావని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుంకరి రాజారామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐ.పావని, ఎల్ మహేష్, డాక్టర్ తిరుపతయ్య, రవీందర్ గౌడ్ వివిధ యూనివర్సిటీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్ష , సెక్రటరీలు పాల్గొన్నారు.
Feb 24 2024, 23:15