NLG: బట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: బట్లపల్లి గ్రామంలో, ఉపాధి హామీ పనిని డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న కందకాల పనిని పరిశీలించి మస్టర్ను తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలతో పీడి మాట్లాడారు. కూలీలు తమకు రూ.190 వస్తున్నాయని చెప్పగా, రూ. 272 వచ్చే విధంగా పనిచేయాలని వారికి సూచించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించడం జరుగుతుందని సూచించారు.
ఈ సందర్భంగా పిడి నాగిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 844 గ్రామపంచాయతీ లలో రోజు వంద మంది చొప్పున కూలీలు రావాలని, అందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో 300% పనులను గుర్తించి సాంక్షన్ తీసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున, గ్రామపంచాయతీ నుండి మంచినీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి మంచినీటి వసతికి సంబంధించిన డబ్బులు గ్రామపంచాయతీ కి చెల్లింపులు చేస్తామన్నారు. ప్రతి కూలీకి ఆధార్ అనుసంధానం చేసి ఆధార్ బేస్డ్ పేమెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
ప్రతి గ్రామంలో నర్సరీ ను ఏర్పాటు చేసి 100% మొక్కల జర్మనేషన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి నర్సరీ షేర్ నెట్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. వీరి వెంట అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నవీన్, ఎంపీడీవో మునయ్య, ఏపీవో వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి అక్షిత, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షమయ్య, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.




నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:








నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Feb 23 2024, 22:08
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.2k